మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

Advertisements

<p>దేశానికి అన్నం పెట్టే అన్నదాత&period;&period; ఇప్పుడు అడుగడుగునా దగా పడుతున్నాడు&period; ఆకాశం వైపు చూసి వర్షం కోసం ప్రార్థించిన ఆ కళ్లు&period;&period; ఇప్పుడు గిరిజన సహకార సంఘం కొనుగోలు కేంద్రాల వైపు దీనంగా చూస్తున్నాయి&period; మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది&period; చేతికందిన పంటను గుండెలకు హత్తుకుని కేంద్రానికి తీసుకు వస్తే&period;&period; అక్కడ ఎదురవుతున్న పరిస్థితులు వారిని కుంగదీస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>20 రోజులు&period;&period; అక్షరాలా ఇరవై రోజులుగా మండుటెండలో&comma; కనీసం తాగడానికి నీరు కూడా లేని చోట రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు&period; అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు&period;&period; &&num;8216&semi;తరుగు&&num;8217&semi; పేరుతో జరుగుతున్న నిలువు దోపిడీ మరోవైపు&period; ప్రతి క్వింటాల్‌కు రెండు కిలోల చొప్పున రైతుల పొట్ట కొడుతున్నారు&period; అర్థాకలితో అలమటిస్తూ&comma; అప్పుల వాళ్ల భయంతో వణికిపోతున్నారు&period;<&sol;p>&NewLine;<p>పంట చేతికొచ్చినప్పుడు ఆ రైతు ఎంత మురిసిపోయాడో&period;&period; ఈరోజు అదే పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి ఇరవై రోజులు గడుస్తోంది&period; &period; &&num;8216&semi;రేపు కొంటాం&period;&period; మాపు కొంటాం&&num;8217&semi; అని అధికారులు చెబుతున్న మాటలు&&num;8230&semi; కోటి ఆశలతో ఎదురుచూసే రైతు గుండెల్లో శూలాల్లా గుచ్చుకుంటున్నాయి&period; గిరిజన సహకార సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కొనుగోలు ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా స్పష్టంగా కనబడుతోంది&period;<&sol;p>&NewLine;<p>రైతు కష్టాన్ని దోచుకోవడానికి &&num;8216&semi;తరుగు&&num;8217&semi; అనే ఒక వింత ఆచారం అమలవుతోంది&period; క్వింటాల్ కు అదనంగా రెండు కిలోలు&excl; ఎందుకు&quest; ఏ లెక్కన&quest; ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇప్పటికే దెబ్బతిన్న రైతుకు&comma; ఈ రెండు కిలోల తరుగు అంటే ఒక్కో క్వింటాల్ పై వందల రూపాయల నష్టం&period; ఊరికే పండలేదు ఆ పంట&period;&period; ఎరువుల కోసం&comma; విత్తనాల కోసం&comma; కూలీల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి&period; అటు అప్పుల వాళ్ల భయం&period;&period; ఇటు అధికారుల నిర్లక్ష్యం&period;&period; మధ్యలో నలిగిపోతున్నాడు రైతన్న&period;<&sol;p>&NewLine;<p>కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి చూస్తే సభ్య సమాజం తలదించుకోవాలి&period; కనీసం తాగడానికి గుక్కెడు మంచి నీరు లేదు&period; ముసలివారు&comma; మహిళా రైతులు ఆ చెట్టు నీడనో&period;&period; గోనె సంచీల నీడనో తలదాచుకుంటున్నారు&period; మరుగుదొడ్ల సౌకర్యం లేదు&comma; నీడ కోసం పందిళ్లు లేవు&period; తేమ శాతం సాకుతో కాలయాపన చేస్తూ గన్నీ సంచీలు లేవని చెబుతూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు&period; గిరిజన ప్రాంతాల్లో రైతులంటే అధికారులకు చిన్నచూపు ఎందుకు ప్రశ్నిస్తున్నారు&period; తరుగు పేరుతో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని&comma; లేకుంటే ఆందోళనలు చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు&period;ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి&comma; ఈ దోపిడీని ఆపి&comma; అన్నదాతను ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరోసారి వివాదం..