విపక్షాలపై మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు..

Advertisements

<p>ములుగు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్&comma; గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; మేడారంలో జరిగిన ప్రమాద ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదని ఆమె హితవు పలికారు&period; నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజల మనోభావాలను కించపరిస్తే సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు&period; అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు&period; అది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమేనని&comma; అందులో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు&period; అసత్య ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని&comma; బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే నేతలను వదిలిపెట్టబోమని హెచ్చరించారు&period; అభివృద్ధిని చూసి ఓర్వలేక&comma; ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి&period; ఆధారాలు లేకుండా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.