116
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. గతంలో తాను తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించినప్పుడు తమకేమీ సంబంధం లేదన్న సజ్జల, ఇప్పుడు తాను కాంగ్రెస్ కు మద్దతిస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు. తనపై మాట్లాడడం కాదని, ఏపీ పరిస్థితులపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల సజ్జల స్పందించాలని హితవు పలికారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపే శక్తి కాంగ్రెస్ కే ఉందని, అందుకే ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు.