ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్స్

Zero tickets

Advertisements

&NewLine;<p>ఎన్నికల హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది&period; కాగా గురువారం రాత్రి 12 గంటల నుంచి జీరో టికెటింగ్ విధానం అమ్లలోకి వచ్చింది&period; జీరో టికెట్లను జారీ చేయాలని ఆర్టీసీ అధికారులకు ఎండీ వీసీ సజ్జనార్‌ ఆదేశాలు జారీ చేశారు&period; జీరో à°Ÿà°¿à°•ెటింగ్ విధానాన్ని గురువారం రాత్రి ప్రయోగాత్మకంగా పరిశీలించారు&period; అది విజయవంతమవ్వడంతో అమల్లోకి తీసుకొచ్చారు&period; ఈ మేరకు టికెట్లు జారీ చేసే టిమ్ మెషిన్లలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేశారు&period; ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు&comma; ప్రయాణించేది ఆర్డినరీ బస్సా లేక ఎక్స్‌ప్రెస్ బస్సా అనే వివరాలు జీరో టికెట్ పై రికార్డ్ అవుతున్నాయి&period; మరోవైపు రెగ్యులర్ బస్సులతోపాటు ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది&period; పండుగలు&comma; జాతరల సమయాల్లో నడిపే బస్సు సర్వీసుల్లో కూడా ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపింది&period; వారాంతాల్లో నడిపే అదనపు బస్సులకూ ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది&period; మహిళలు&comma; బాలికలు&comma; ట్రాన్స్‌జెండర్లకు జీరో టికెట్‌‌పై ప్రయాణించవచ్చు&period; కొమురవెల్లి&comma; నాగోబా వంటి జాతరలతోపాటు ప్రధానమైన పండుగలకు ప్రత్యేకంగా నడిపే సర్వీసుల్లో ఈ వెసులుబాటు మహిళలకు అందుబాటులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.