తిరుమలలో అన్నప్రసాద విరాళం పై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాన్ని అందించే పథకానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం ప్రారంభించింది. ఇందుకోసం ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కోసం రూ.38 లక్షలు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విరాళం మొత్తం గతంలో రూ.33 లక్షలు ఉండగా, ఆ మొత్తాన్ని టీటీడీ రూ.38 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.పెరిగిన ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇదే సమయంలో మరిన్ని కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఉదయం అల్పాహారం కోసం రూ. 8 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.15 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.15 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చని టీటీడీ పేర్కొంది. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చని టిటిడి ప్రకటించింది.
అన్నప్రసాద విరాళం పై టీటీడీ కీలక నిర్ణయం
64
previous post