అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయం

Arasavalli Suryanarayana Temple

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లా లో అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించాడని ఇక్కడ లభిస్తున్న శాసనాల వల్ల తెలుస్తున్నది&period; ఇక్కడి సూర్యదేవాలయం లో కల ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వార తెలియుచున్నది&period; హర్షవల్లి అనే ప్రాచీన పేరు అరసవల్లిగా మారిందనేది చరిత్రకారుల అభిప్రాయం&period; ఈ ప్రాంతం 17 à°µ శతాబ్దంలో నిజామునవాబు పాలన క్రిందికి వచ్చింది&period; ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ షేర్ మహమ్మద్ ఖాన్ పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలోని దేవాలయాలను అనేకం ధ్వంసం చేశాడు&period; ఆ విషయాన్ని అతనే పర్షియన్ లిపిలో ఒక శిలాశాసనం ద్వారా ప్రకటించుకున్నాడు&period; అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి కూడా వుంది&period; సుబేదారుకు హిందువుల న్యాయశాస్త్రం గురుంచి&comma; మనుస్మృతి గురించి చెప్పడానికి నియమించబడిన పండితుడు సీతారామ శాస్త్రి అరసవిల్లి దేవాలయంపై జరగనున్న దాడిని గురించి ముందుగా తెలుసుకొని ఎలాగో స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించాడట&period;<br>150 సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించాడట&period; దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి &comma; అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు&period; అప్పటి నుంచి ఈ దేవాలయం క్రమక్రమముగా అభివృద్ది చెందుతూ&comma; అశేషంగా భక్తులనెందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రముగా వెలుగొందుతూ వుంది&period; ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో గర్బ గుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత&period; శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయమైన ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ నారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకుతాయి&period;అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం&comma; ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి&period; ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు&period; సకల జీవులకూ సంక్షేమాన్ని&comma; ఆయురారోగ్యాలనూ&comma; ప్రసాదించే ఈ స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి&period; మాములు రోజులతో పోలిస్తే మాఘ&comma; వైశాఖ&comma; కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది&period; అందులో ముఖ్యంగా రథసప్తమినాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే&period;అలాగే ఉత్తరాయణ&comma; దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి 9&comma; 10&comma; 11&comma; 12 తారీఖుల్లోనూ&comma; అక్టోబర్ 1&comma; 2&comma; 3&comma; 4 తేదీల్లోనూ&comma; స్వామివారి&comma; ధ్రువమూర్తిపై ఆదిత్యునిని తొలికిరణాలు తాకుతాయి&period; స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత&comma; అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి&period; ఇకపోతే… అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ స్థానికులు పిలుస్తుంటారు&period; ప్రత్యేకించి బొల్లి&comma; కంటి వ్యాధులు&comma; కుష్టు&comma; వ్యాధులతో పాటు ఇతర మానసిక&comma; శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు&period; నేడు తుఫాను కారణంగా ఆకాశం మబ్బులు పట్టడంతో ఆందోళన చెందిన భక్తులకు సూర్యకిరణాలు మూడు నిముషాలసేపు మూలవిరాట్టు పాదాలపై పడడంతో భక్తుల ఆనందానికి అంతులేకుండా పోయింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.

పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.

అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.