107
వనపర్తి జిల్లాలో నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో “నేను తప్పనిసరిగా ఓటు వేస్తాను” అనే గోడ పత్రికను ఆవిష్కరించారు. అదేవిధంగా ఓటర్ గైడ్ అనే హాండ్ బుక్ ను ఆవిష్కరించారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం నిలబడాలంటే ప్రతి ఓటరు తన ఓటును తప్పనిసరిగా వేయాలని అదేవిధంగా ఎలాంటి ప్రలోభాలకు ఆశపడకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు.