ఇకపై భారత్‌లోనే లాప్‌టాప్‌ల తయారీ.. కీలక నిర్ణయం తీసుకున్న ఇంటెల్‌

Manufacturing of laptops

Advertisements

&NewLine;<p>ఇండియాలోనే లాప్‌టాప్‌à°² తయారీ దిశగా ఇంటెల్‌ అడుగులు వేస్తోంది&period; ఇందుకోసం 8 స్థానిక కంపెనీలతో జత కట్టింది&period; ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది&period; ఇకపై భారత్‌లోనే లాప్‌టాప్‌à°² తయారీని ప్రోత్సహించనుంది&period; ఈ క్రమంలో&period;&period; భారత్‌లోని ఎనిమిది స్థానిక కంపెనీలతో జత కట్టింది&period; ఈ ఒప్పందం ప్రకారం&period;&period; ఆయా సంస్థలకు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ &lpar;ఈఎంఎస్&rpar;&comma; ఒరిజినల్ డిజైన్ మాన్యుఫాక్చరర్లతో ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్‌à°² తయారీకి అవసరమైన టెక్నాలజీని &OpenCurlyQuote;ఇంటెల్’ షేర్ చేసుకుంటుంది&period; అంతే కాకుండా&period;&period; ల్యాప్‌టాప్‌à°² తయారీలో క్వాలిటీ కంట్రోల్&comma; ప్రొడక్ట్ బెంచ్ మార్క్ కాపాడే విషయంలోనూ అవసరమైన తోడ్పాటును అందిస్తుంది&period; తద్వారా &OpenCurlyQuote;మేకిన్‌ ఇండియా’ప్రాజెక్టుకు ఇంటెల్ మరింత ఊతమివ్వనుంది&period; ఇంటెల్ సంస్థతో జత కట్టిన దేశీయ కంపెనీల్లో&period;&period; భగవతీ ప్రొడక్ట్స్&comma; డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా&comma; కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్‌&comma; ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్&comma; పనాచే డిజిటల్ లైఫ్&comma; స్మైల్ ఎలక్ట్రానిక్స్&comma; సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ&comma; వీవీడీఎన్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి&period;వీటిలో పనాచే డిజిటల్ లైఫ్&comma; కేన్స్ టెక్నాలజీ&comma; సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ తొలిసారి భారత్‌లో ల్యాప్‌టాప్‌à°² తయారీలోకి ఎంటరవుతున్న సంస్థలు కావడం గమనార్హం&period; ఇంటెల్ తీసుకున్న నిర్ణయంపట్ల కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు&period; త్వరలో మరిన్ని సంస్థలు మేకిన్‌ ఇండియా దిశగా అడుగులు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు&period; ఇంటెల్ తాజా నిర్ణయం ప్రభుత్వం చేపట్టిన మేక్-ఇన్-ఇండియా ప్లాన్‌కు నెల గ్యాప్‌లో రెండవ ప్రధాన ప్రోత్సాహం కావడం విశేషం&period; అక్టోబర్‌లో&period;&period; గూగుల్ భారతదేశంలో తన తాజా ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 8 ఫోన్‌à°² తయారీని ప్రారంభించే ప్రణాళికలను ప్రకటించింది&period; ఈ క్రమంలో భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్‌తో పాటు&period;&period; భారత్ ఎఫ్‌ఐహెచ్‌&comma; తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌తో గూగుల్ చర్చలు జరుపుతోందని సమాచారం&period; అలాగే&period;&period; మరో దిగ్గజ సంస్థ యాపిల్‌ సైతం ఐఫోన్‌ 15 సిరీస్‌ విషయంలో మేక్‌ ఇన్‌ ఇండియా దిశగా అడుగులు వేసిన విషయం కూడా తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.

హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.

సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.