అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.

Advertisements

<p>హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు&period; అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేంద్రనగర్ ఎస్‌వోటీ బృందంతో కలిసి నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు&period; దర్యాప్తులో ప్రధాన నిందితుడు మహమ్మద్ ఫైజాన్ బక్షి నాగ్‌పూర్ నుంచి గంజాయిని తెప్పించి&comma; సబ్‌ప్యాడలర్ సయ్యద్ సాదిక్ ద్వారా చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి నగరంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు&period; నిందితుల వద్ద నుంచి 8&period;410 కిలోల ఎండు గంజాయి&comma; మోటార్‌సైకిల్&comma; డిజిటల్ తూకం మిషన్లు&comma; సీలింగ్ మిషన్&comma; ప్యాకింగ్ మెటీరియల్&comma; మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు&period; అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా నెట్‌వర్క్‌పై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.