ఈపీఎఫ్ఓ అన్ క్లైమ్డ్ డిపాజిట్లపై కేంద్రం కీలక నిర్నయం..

Advertisements

<p>ఈపీఎఫ్‌ఓలో ఎవరూ క్లెయిమ్‌ చేయని మొత్తాలకు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది&period; భవిష్యనిధి సంస్థ వద్ద ఉన్న మొత్తాలను ఆయా చందాదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది&period; దీనితో 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది&period; తొలి దశలో 7 లక్షల మంది చందాదారులు లబ్ధి పొందనున్నారు&period; దీనికి సంబంధించిన పైలట్‌ ప్రాజెక్ట్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు&period;ఈ మేరకు నిర్ణయం ఈపీఎఫ్‌ఓలో సమీక్షా సమావేశంలో తీసుకున్నారు&period;మొత్తం 31&period;86 లక్షల ఖాతాలు నిర్వహణలో లేకుండా ఉన్నట్లు ఈపీఎఫ్‌ఓ గుర్తించింది&period; ఇందులో రూ&period;10&comma;903 కోట్ల మేర నిల్వలు ఉన్నాయన్నది అంచనా&period; ఇందులో 7&period;11 లక్షల ఖాతాల్లో రూ&period;1000 మాత్రమే నగదు నిల్వలు ఉన్నట్లు ఈపీఎఫ్‌ఓ గుర్తించింది&period; ఈ ఖాతాల్లోని నగదు విలువ రూ&period;30&period;52 కోట్లుగా ఉంది&period; సాధారణంగా మూడేళ్లు పైబడి ఎలాంటి లావాదేవీలు లేని వాటిని నిర్వహణలో లేని ఖాతాలుగా గుర్తిస్తారు&period; ఇలాంటి మొత్తం ఇన్‌ ఆపరేటివ్‌ ఖాతాల్లో కొన్ని 20 ఏళ్లకు పైబడినవి కూడా ఉన్నాయి&period;పైలట్‌ ప్రాతిపదికన తొలుత 7 లక్షల ఖాతాల అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు&period; ఆధార్‌తో అనుసంధానం అయ్యి ఉన్న బ్యాంకు ఖతా&comma; ఈపీఎఫ్‌ఓ దగ్గర ఉన్న వివరాల ఆధారంగా ఈ నగదును వేయనున్నారు&period; దీనికి ఎలాంటి క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ డాక్యుమెంట్లు గానీ&comma; డాక్యుమెంట్లు గానీ ఇవ్వాల్సిన అవసరం లేదు&period; పైలట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం అయితే మిగిలిన 25 లక్షల నిస్తేజ ఖాతాలకు ఆటోమేటిక్‌ రిఫండ్‌ విధానాన్ని అనుసరించనున్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.