ఈరోజు పూజాసమయం లో నేరేడు పండు లో హనుమ రూపం

Hanuma form in Apricot

Advertisements

&NewLine;<p>పరమాత్మ ప్రక్రుతి అంతా నిండి ఉంటాడు&period; ఆయనను పలురూపాలుగా భావించి ధ్యానించే భక్తులకు ఆయన ఉనికిని అనేకానేక విధములుగా తెలియపరుస్తుంటాడు&period; భావన బలంగా ఉండాలి&period;అందుకే పెద్దలు శివుణ్ణి ఆరాధించాలంటే నీవు శివునిగా మారాలి అంటారు&period; అదే మహన్యాసం గా సాగుతుంది శివాభిషేకం లో ఇక్కడ శివతత్వాన్ని తన అన్ని అంగములలో భావన చేస్తాడు సాధకుడు&period; ఇక్కడ పీఠం లో జరుగుతున్న హనుమంతుని ఉపాసనా &comma;వచ్చేసాధకుల స్థితి ననుసరించి ఆయన అనుగ్రహప్రసారం ఎలాఉంటున్నదో అనేక ఉదాహరణలద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉన్నాము&period; స్వామి ఉపాసనను చూసి పులకించి తామూ స్వామి భావాన్ని ధ్యానిస్తున్నాయేమో ఇక్కడ చెట్లు&period; తీయని ఫలములనిస్తున్న నేరేడు చెట్లు కూడా అలానే ధ్యానించి స్వామి పట్ల అపార ప్రేమతో ఉన్నాయో గాని ఓఫలం లో స్వామి రూపాన్ని ఆవిష్కరించాయి&period; ఈరోజు పూజసమయంలో నివేదన చేయటానికి మాతమ్ముడు పీఠం లో గల నేరేడు పండ్లు కోసితెచ్చాడు&period; అనుకోకుండా చేతిలో పండ్ల లో ఓ పండు హనుమ ముఖ రూపంతో కనపడింది&period; వేంటనే నాదగ్గరకొచ్చి చూపాడు&period; నల్లని నేరేడు ఫలానికి ఓవైపు ఎర్రని పెదవులుగా దానిపైన రెండు కన్నులుగా ప్రకృతిమాత చెక్కి ఇచ్చిన ఆరూపం &period; ఆనందాన్ని కలుగ జేసింది&period; ఆ ఫలాన్ని ఇచ్చిన చెట్టు స్వామిని ఎంతగా ధ్యానిస్తున్నదో కదా &excl; ఎంతటి అదృష్టమో కదా ఆవృక్షానిది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.

శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.

విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు.