Honor Magic 6 మనం వాడే స్మార్ట్ఫోన్లలో ఏవైనా యాప్స్ ఓపెన్ చేయాలన్నా.. వాటిని ఆపరేట్ చేయాలన్నా చేతి వేళ్లు తప్పనిసరి. అయితే కొత్త టెక్నాలజీ ద్వారా మనం వాడే స్మార్ట్ ఫోన్లలో యాప్స్‌ను ఓపెన్ చేసేందుకు చేతులను ఉపయోగించాల్సిన అవసరమే లేదు. మన కంటిచూపుతోనే ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతాయట. మీ కంటిచూపును బట్టే ఫోన్ కూడా పని చేస్తుందట. ఈ సరికొత్త ఫీచర్లకు సంబంధించి హానర్ కంపెనీ ఇటీవలే Eye-Tracking ఫీచర్లతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించనుంది. చిప్ మేకర్ స్నాప్‌డ్రాగన్ హవాయిలోని మౌయ్‌లో సమ్మిట్‌ను నిర్వహించింది. సమ్మిట్ రెండో రోజు హానర్ సిఇఒ జార్జ్ జావో ప్రేక్షకులను కట్టిపడేశారు. త్వరలో కంపెనీ తమ కొత్త స్మార్ట్ ఫోన్ హానర్ మ్యాజిక్ 6 తీసుకురానుంది. అందులో మీరు Eye-Tracking ఫీచర్ ఆప్షన్ చూడొచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఫోన్ యాప్‌లను కంటిచూపుతో సులభంగా ఓపెన్ చేయొచ్చని ఆ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. దీంతో మన స్పర్శ ఫోన్‌కు అవసరం లేదు. మన చేతులతో అవసరం లేకుండా కొన్ని యాప్స్ పని చేస్తాయి. ఈ ఫీచర్‌కు కంపెనీ ‘మ్యాజిక్ క్యాప్సూల్’ అని పేరు పెట్టింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంటి చూపుతో ఫోన్ యాప్స్ ఓపెన్ చేయొచ్చు..!
87
previous post