Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Andhra Pradesh ఇస్రో ఖాతాలో మరో ఘనత

ఇస్రో ఖాతాలో మరో ఘనత

by Satya
ఇస్రో ఖాతాలో మరో ఘనత

వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనతను సాధించింది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఎస్ఎస్ఎల్వీ డీ3ని విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ రాకెట్ ద్వారా 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. విపత్తుల సమయంలో ఈ ఉపగ్రహం కీలక సమాచారాన్ని పంపిస్తుంది. ప్రకృతి విపత్తులతో పాటు అగ్ని పర్వతాలను కూడా ఈ శాటిలైట్ పర్యవేక్షిస్తుంది. మొత్తం 17 నిమిషాల పాటు రాకెట్ ప్రయోగం కొనసాగింది.
ఈవోఎస్ శాటిలైట్ ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో అభివృద్ధి చేశారు. ఈ ఉపగ్రహంలో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ లో చిత్రాలను తీస్తుంది. ఈ శాటిలైట్ పంపించే సమాచారం విపత్తు నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఉపగ్రహం ఏడాది పాటు సేవలు అందిస్తుంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.
    అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ…
  • నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.
    సిక్కింలో భారీ విషాదం చోటుచేసుకుంది. దక్షిణ సిక్కింలోని సమర్‌దుంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందారు. వారి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 20 మందికిపైగా…
  • ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.
    ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు కొత్త ఛాంపియన్ దక్కింది. న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ అదనపు సమయంలో 1-0తో విజయం సాధించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హాజరుకావడంతో..ఈ మ్యాచ్‌తో పాటు…
  • మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం.
    మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం మరింత తీవ్రంగా మారుతోంది. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న సైనిక దాడులు కొత్త మలుపు తిరిగాయి. తాజాగా జోర్డాన్‌లోని అల్-అజ్రాఖ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ భారీ క్షిపణి, డ్రోన్ దాడులు…
  • వర్షాకాల సమావేశాల తొలి రోజే పార్లమెంట్‌లో రచ్చ.
    సభలో నిరసనలు కొనసాగుతుండగానే.. పార్లమెంట్ వెలుపల కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో పార్లమెంట్’ కార్యక్రమం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

042041
Total views : 221454

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: