చైనా డ్రోన్ల విషయంలో వేగంగా పురోగతి సాధిస్తోంది. తాజాగా అతిపెద్ద పౌర రవాణా డ్రోన్‌ను తొలిసారి పరీక్షించింది. దీనిని ఆ దేశానికి సిచువాన్ టెంగ్డెన్ సైన్స్ టెక్ ఇన్నోవేషన్ సంస్థ తయారుచేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ల తయారీ, విక్రయాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. రెండు ఇంజిన్లతో పనిచేసే ఈ డ్రోన్ ఏకంగా 2 టన్నుల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. సిచవాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ప్రయోగం సందర్భంగా దాదాపు 20 నిమిషాలపాటు అది ప్రయాణించింది.ఈ డ్రోన్ రెక్కల పొడవు 16 మీటర్లు, ఎత్తు 15 అడుగులు ఉంది. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే దీనిని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే సెస్నా 172 విమానం కంటే కొంచెం ఎక్కువ పొడవే ఉంటుంది.ఇప్పటికే చైనా జూన్‌లో ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ తయారుచేసిన కార్గో డ్రోన్‌ను పరీక్షించింది. ఇది దాదాపు 700 కేజీల బరువును తీసుకొని.. 520 కిలోమీటర్లు ప్రయాణించింది. వచ్చే ఏడాది మరో యూఏవీని పరీక్షించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది 2 టన్నుల పేలోడ్‌తో.. 2వేల కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా వేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అన్నమయ్య జిల్లాలో విషాదం…అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పుంగనూరు త్యాగరాజు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిని తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లుగా గుర్తించారు.…
- నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. నిర్భయ నిధి పథకం ద్వారా జిల్లాలో…
- అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ.అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతవరం, నెక్కలు గ్రామసభలకు మంత్రి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి…
- ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్‌కు దారితీసింది.ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్‌కు దారితీసింది. జపాన్ సముద్ర జలాల్లోకి నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. తమ దేశ సముద్ర జలాల్లోకి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు…
- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో డ్రగ్స్ కలకలం.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫామ్‌హౌస్‌లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి