ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దేవాదాయ శాఖలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది.

దేవాదాయ శాఖ డీసీ పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఛార్జ్ మెమో జారీ

Advertisements

<p>ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దేవాదాయ శాఖలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది&period; డిప్యూటీ కమిషనర్ పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఎండోమెంట్ కమిషనరేట్ ఛార్జ్ మెమో జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది&period; 2017లో తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఈవోగా పనిచేసిన సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి&period; ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు&period; ఆలయానికి సంబంధించిన బంగారం&comma; రికార్డులు&comma; ఖర్చులపై సమగ్ర విచారణ కొనసాగింది&period; అప్పట్లో సస్పెన్షన్‌కు గురైనప్పటికీ&comma; తిరిగి పదవిలోకి రావడం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ఇక పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంలో రాజకీయ ప్రభావం&comma; ఆర్థిక బలం కీలక పాత్ర పోషించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; ఏసీబీ కేసు తీవ్రతను తగ్గించి&comma; డిపార్ట్మెంటల్ విచారణకు మళ్లించుకున్నట్లు సమాచారం&period; ప్రస్తుతం పెనుసుల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో డీసీగా కొనసాగుతున్న ఆయన&comma; ఛార్జ్ మెమో జారీ అనంతరం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం గమనార్హం&period; మరోవైపు నగరంలోని ఖరీదైన భూముల రికార్డులను తారుమారు చేశారన్న విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు&period; ఈ కేసులో పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కమిషనరేట్ ఆదేశించడంతో&comma; తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.