ఈ అక్రమ వెంచర్ వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు?

Advertisements

<p>పచ్చదనం పేరుతో ప్రజల నమ్మకంపై దెబ్బకొట్టారు&period; లాభాల పేరు చెప్పి దండుకుంటున్నారు&period; సామాన్యులకు గుండుసున్నా కొడుతున్న ఈ స్కాం సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది&period; సీవీఆర్‌ న్యూస్‌ పరిశోధనలో అక్రమం బయటపడింది&period; హరితవనం అనే పేరుతో అక్రమ వెంచర్ కోట్లాది రూపాయల దందాగా మారింది&period; రైతుల భూములు చౌకగా కొనుగోలు చేసి నగర ప్రజలను టార్గెట్ చేస్తూ భారీగా అమ్మకాలు సాగిస్తున్నారు&period; అందరి కళ్లముందే ఈ దందా సాగుతున్నా అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు&period; ఈ స్కాం వెనుక అసలు నిజం ఏంటి&quest; ఎవరి అండతో ఈ అక్రమం సాగుతోంది&quest;<&sol;p>&NewLine;<p>సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ నాగిల్‌గిద్ద మండలం మోర్గి గ్రామ శివారుల్లో హరితవనం పేరిట నడుస్తున్న అక్రమ వెంచర్ సంచలనం రేపుతోంది&period; 23à°µ సర్వే నంబర్‌లో మొత్తం 35 ఎకరాల 30 గుంటల భూమి ఉంది&period; 21 మంది పట్టాదారులు ఉన్నారు&period; ఆ భూమిని తక్కువ ధరకే కొనుగోలు చేశారు&period; తర్వాత అదే భూమిని ప్లాట్లుగా మార్చేశారు&period; పూలు&comma; ఖర్జూర మొక్కలు నాటారు&period; గ్రీన్ ప్రాజెక్ట్ అంటూ ఆకర్షణీయమైన అడ్వర్టయిజ్‌మెంట్లు ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p>ఇంకేముంది&&num;8230&semi; ప్రధానంగా హైదరాబాద్ ప్రజలను టార్గెట్ చేశారు&period; ఒక గుంట ధరను లక్షా 50 వేల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు నిర్ణయించారు&period; అంతటితో ఆగలేదు&period; ప్రతి ఆదివారం కార్లలో ఉచితంగా తీసుకెళ్తున్నారు&period; విందులతో కస్టమర్లను మభ్యపెట్టి అగ్రిమెంట్లు చేయిస్తున్నారు&period; ఈ వ్యవహారంపై ప్రశ్నించిన సీవీఆర్‌ న్యూస్‌ ప్రతినిధులను బెదిరించారు&period;<br &sol;>&NewLine;బౌన్సర్లతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు&period;<&sol;p>&NewLine;<p>ఇక వెంచర్ యజమాని గంగాధర్ అయితే&period;&period; నన్నే ప్రశ్నిస్తారా&quest; అంటున్నారు&period; ఇక ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే&period;&period; స్థానిక రాజకీయ నేతలు నోరు మెదపడం లేదు&period; ప్రభుత్వ అధికారులు ఈ వ్యవహారంపై మౌనం పాటిస్తున్నారు&period; మండల పరిధిలో అన్ని అక్రమాలను ప్రశ్నించి&comma; రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన తహసీల్దార్‌ అయితే కళ్లుండీ కబోదిలా మారిపోయారు&period; ఇదేమిటని ప్రశ్నిస్తే&period;&period; తెగించి మాట్లాడుతున్నారు&period; మీకు నచ్చింది రాసుకోండి అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ అక్రమ వెంచర్ వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు&quest; ప్రజల డబ్బుతో జరుగుతున్న ఈ మోసం ఎప్పుడు ఆగుతుంది&quest; ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు&quest; ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నట్లు&quest; జాయింట్‌ కలెక్టర్‌&comma; కలెక్టర్‌ పాత్ర ఏంటి&quest; ఈ అక్రమం ఇంత బహిరంగంగా ఎలా సాగుతోంది&quest;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..