ఏపీ శాసనసభ ఆమోదించిన రెండు కీలక బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది.

Advertisements

<p>ఏపీ శాసనసభ ఆమోదించిన రెండు కీలక బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది&period; ఏపీ అసైన్డ్ భూముల సవరణ బిల్లు-2026 &comma; ఏపీ గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లు 2026కు శాసనమండలిలో ఆమోదం లభించింది&period; ఈ సందర్భంగా అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో మాట్లాడారు&period; అసైన్డ్ భూముల చట్ట సవరణకు శాసన మండలి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు&period; గత గురువారం శాసనసభలోనూ ఈ బిల్లుకు ఆమోదం లభించిందన్నారు&period; ఈ చట్ట సవరణ ద్వారా అసైన్డ్ భూములను క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజు ద్వారా కేటాయించే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు&period;<&sol;p>&NewLine;<p>ఎకరాకు ఏడాదికి రూ&period;31 వేలు లీజు రేటు నిర్ణయించారని&period;&period; ప్రతి రెండేళ్లకు 5 శాతం వరకు లీజు మొత్తం పెంచే విధంగా సవరణ చేసినట్లు తెలిపారు&period; అసైనీ దారులకు ఈ లీజు ద్వారా నికరమైన ఆదాయం లభిస్తుందన్నారు&period; బంజరు భూములు&comma; చౌడు భూములుగా ఉన్న అసైన్డ్ భూములకు స్థిరమైన ఆదాయం వస్తుందని మంత్రి తెలిపారు&period; రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు క్లీన్ ఎనర్జీ చాలా కీలకమని మంత్రి చెప్పారు&period; క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కొన్ని చోట్ల అసైన్డ్ భూములు అవసరమవుతాయని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు&period; అసైనీదారుల పూర్తి అనుమతితోనే లీజుకు తీసుకుంటామని వెల్లడించారు&period; ట్రై-పార్టీ అగ్రిమెంట్ ద్వారా వారికి పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని అన్నారు&period; ఈ చట్ట సవరణతో రూ&period;10 లక్షల కోట్ల విలువైన క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవకాశం ఉంటుందని&period;&period; తద్వారా ప్రత్యక్షంగా&comma; పరోక్షంగా 7&period;5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు&period; అలాగే&comma; ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లు-2026కు కూడా శాసనమండలి ఆమోదం తెలిపింది&period; గ్రామ&comma; వార్డు సచివాలయాలను &&num;8216&semi;స్వర్ణ గ్రామం&&num;8217&semi;&comma; &&num;8216&semi;స్వర్ణ వార్డు&&num;8217&semi;లుగా మార్చే సవరణకు ఆమోదం లభించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..

అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..

చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం…