ఏపీ హైకోర్టులో – చంద్రబాబుకు బెయిల్ మంజూరు

Chandrababu Naidu

Advertisements

&NewLine;<p>ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది&period; ఎట్టకేలకు దాదాపు 53 రోజుల తర్వాత చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయ్యింది&period; స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది&period; అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ కోరడంతో ఏపీ హైకోర్ట్ మంజూరు చేసింది&period; నాలుగు వారాలపాటు నవంబర్ 24 వరకు అనుమతి ఇచ్చింది&period; చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు&period; స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో సెప్టెంబర్ 9à°¨ నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే&period; 10à°µ తేదీ ఉదయం ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు&period; అనంతరం 10 అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు బాబును తరలించారు&period; గత 53 రోజులుగా టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు&period; చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు&period; ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది&period; రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎయిర్ పోర్టుకు వరకు చంద్రబాబుకు భారీ ఊరేగింపుతో స్వాగతం పలకాలని టీడీపీ శ్రేణులు నిర్ణయించారు&period; రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు‌ను తీసుకువెళ్ళి ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స చేయించాలని నిర్ణయించారు&period; ఇప్పటికే చంద్రబాబుకు అధికారులు ఎన్‌ఎస్‌జీల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు&period; మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ &comma; ఆయన సతీమణి బ్రాహ్మణి రాజమండ్రికి చేరుకున్నారు&period; ఈ సందర్భంగా చంద్రబాబు‌కు బెయిల్ మంజూరు అయిన విషయాన్ని లోకేష్ వద్ద నాయకులు ప్రస్తావించారు&period; యుద్ధం ఇప్పుడు ప్రారంభం అయ్యిందని నాయకులు&comma; కార్యకర్తలతో లోకేష్ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.