జోగులంబా గద్వాల జిల్లా అలంపూర్ తనకు బీఫామ్ ఇవ్వకుండా అగ్రకులాల ఆధిపత్యం చేస్తూ అడ్డుపడ్డారని కనీసం ఒక జీవో కాపీ చదవలేని స్థితిలో ఉన్న వ్యక్తికి బీఫామ్ ఇవ్వడం ఏమిటని ఎమ్మెల్యే అబ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో జెండ కూడా మోయని ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి పార్టీ కోసం పనిచేయని వ్యక్తికి ఈరోజు బీఫామ్ ఇప్పించడంలో పెట్టిన శ్రద్ధ చాలా బాధగా ఉందని తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. తనను నమ్ముకున్న కార్యకర్తలు నాయకులు తమ భవిష్యత్తు కార్యాచరణను తామే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు సైలెంట్ గా ఉండటమే తన నిర్ణయం అన్నారు. అలంపూర్ ప్రజలకు తాను చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని అలంపూర్ ప్రజలు తనను ఎప్పుడూ మోసం చేయలేదని గుర్తు చేశారు.
ఒక జీవో కాపీ చదవలేని స్థితిలో ఉన్న వ్యక్తికి బీఫామ్..
79
previous post