కడప జిల్లాలో సీఎం జగన్ టూర్ కొనసాగుతుంది. పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సీఎం. పులివెందులలో రెండు రోజుల పర్యటనలో భాగంగా భాకరాపురం రింగురోడ్డు సర్కిల్లో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ ఆలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. సీఎం జగన్‌కు పూర్ణకుంభంతో వేదపండితులు ఘనంగా స్వాగతం పాలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు సీఎం. 4ఎకరాల విస్తీర్ణంలో రూ.4.54 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మించారు. తర్వాత పులివెందులలో 38 ఎకరాలలో రూ .14.04 కోట్లతో నూతనంగా తీర్చిదిద్దిన శిల్పారామ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు సీఎం జగన్. శిల్పారామంలో ఏర్పాటుచేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రారంభించారు. అనంతరం శిల్పారామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు సీఎం. శ్రీస్వామి నారాయణ గురుకుల స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం జగన్. విద్యార్థులు, స్వామి నారాయణ్ సంస్థ ప్రతినిధులు సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. పులివెందులలో అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటుకు స్వామి నారాయణ్ సంస్థకు 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించిందిన ప్రభుత్వం. 60 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటర్ నేషనల్ స్కూల్ నిర్మాణం చేపట్టింది స్వామి నారాయణ్ సంస్థ. పులివెందుల సమీపంలోని ఏపీ కార్ల్ వద్ద స్వామి నారాయణ్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు రూ.9.96 కోట్ల పాడా నిధులతో ఏపీ కార్ల్ నందు నిర్మించిన అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజీలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఏపీ కార్ల్ నందు రూ. 11 కోట్ల వ్యయం నిర్మించిన అగ్రికల్చర్, హార్టికల్చర్ ల్యాబ్‌లను విజిట్ చేశారు సీఎం జగన్. స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ ల్యాబొరేటరీ ప్రారంభించారు సీఎం. తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌ను సందర్శించారు. యూనిట్‌ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు జగన్. రాత్రికి ఇడుపులపాయ వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్ హాస్‌లో బస చేస్తారు. రేపు ఇడుపులపాయలో ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. తర్వాత ఎకో పార్క్ వేముల మండలం ప్రజాప్రతినిథులతో సమావేశమవుతారు జగన్మోహన్ రెడ్డి.
కడప జిల్లాలో రెండు రోజు కొనసాగుతున్న జగన్ పర్యటన..
149
previous post