కరీంనగర్​లో నామినేషన్ వేసిన బండి సంజయ్, భారీ బైక్​ ర్యాలీతో

Advertisements

&NewLine;<p>బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లో నామినేషన్ వేశారు&period; ఈ సందర్భంగా కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు&period; ఈ ర్యాలీలో ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి సంజయ్‌ పాల్గొన్నారు&period; ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడారు&period; రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా పోరాడితే నాపై 30 దొంగ కేసులు పెట్టారన్నారు&period; మతతత్వవాది అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారన్నారు&period; ధర్మం కోసం పోరాడేది భాజపా&period; రాజాసింగ్&comma; నేను&period;&period; ధర్మం కోసం పోరాడేవాళ్లం&period; మేం ఎప్పుడూ కాషాయజెండాను వదిలిపెట్టలేదు&period; ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు&period; రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించాక పార్టీని పరుగులెత్తించానని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు&period; తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన దుబ్బాక&comma; జీహెచ్‌ఎంసీ&comma; ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించినట్లు చెప్పారు&period; రాష్ట్రవ్యాప్తంగా 150 రోజుల పాటు ప్రజాసంగ్రామ యాత్ర చేసి కాషాయ జెండాను తెలంగాణ అంతటా రెపరెపలాడించానన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్