96
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఇద్దరు కార్పొరేటర్లను బీజేపీ రాష్ట్ర నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 32వ డివిజన్ కార్పొరేటర్ మర్రి భావన, 38వ డివిజన్ కార్పొరేటర్ కచ్చు రవితోపాటు యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి సతీష్ లను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేసింది. తక్షణమే ఈ సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా నాయకులు తమ వ్యవహారశైలిపట్ల వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.