కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. జనాభాలో అధిక శాతంగా ఉన్న వర్గాన్ని అణిచివేయాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో మీడియాతో సంజయ్ మాట్లాడారు. అణగారిన వర్గాల పట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఖరి మార్చుకోవాలని.. వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గమంతా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలు కూడా మా పార్టీకి మద్దతిస్తున్నారన్నారు. బీసీలకు బీఆర్ఎస్ కేవలం 23, కాంగ్రెస్ 19 సీట్లే ఇచ్చాయన్నారు. బీజేపీలో సీఎం అభ్యర్థిని ఎప్పుడూ ముందు ప్రకటించమన్నారు. ఎన్నికల తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు, అధిష్ఠానం కలిసి ఆ అభ్యర్థిని నిర్ణయిస్తారన్నారు. ఎవరు సీఎం అని ముందుగా ప్రకటించే సిస్టమ్ బీజేపీలో లేదన్నారు. ఒకరిద్దరు చెప్తే సీఎం అయ్యే వ్యక్తిని కాదన్నారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే చిత్తశుద్ధి గల కార్యకర్తను అని బండి సంజయ్ అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చిన్నచూపు – బీజేపీ
122
previous post