తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో బీసీలకు తగిన కేటాయింపులు లేవని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘కామారెడ్డి డిక్లరేషన్’ హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. హన్మకొండ ఏకాశిల పార్క్ నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు.. ఏటా 20 వేల రూపాలయ కోట్లు కేటాయించాలని, 56 శాతం జనాభాకు న్యాయం చేయాలని బీసీ సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బీసీ సంఘాల ఆందోళన, డిమాండ్లపై మరింత సమాచారం మా వరంగల్ కరస్పాండెంట్ కిషోర్ అందిస్తారు.
bc
తెలంగాణలో త్వరలో కులగణన చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాలపై సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని, వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలని సూచించారు. స్కూల్ భవనాల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లింపులు చేయాలన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చే ప్రణాళికలు రూపొందించాలన్నారు. సచివాలయంలో బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష జరిపారు. సమీక్షకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేయడంపై అధ్యయనం చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేలా స్థలాన్ని గుర్తించాలని తెలిపారు. ఆ భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం రూపొందించాలని ఆదేశించారు.
తెలంగాణ ఆరు గ్యారెంటీలు అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోందని, కానీ ప్రజలు మోసపోవద్దని బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. కర్ణాటకలో ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విఫలమైందన్నారు. అక్కడ ఐదు హామీలను అమలు చేయలేకపోయిందని, తెలంగాణ ప్రజలు ఆరు హామీలతో మోసపోవద్దని హెచ్చరించారు. కర్ణాటక ప్రజలను మోసం చేసిన సిద్ధరామయ్య ప్రభుత్వం దివాలా దిశగా నడుస్తోందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు.
కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని, తమ అభిప్రాయాలను ఎవరైనా స్వేచ్ఛగా చెప్పొచ్చని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో అలాంటి ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించదని, తాను సీఎం అవుతానని హరీశ్‌రావుకు చెప్పే ధైర్యం లేదని, అలా చెప్పిన మరుక్షణం ఆయన జైలులో ఉంటారని చెప్పారు. నిర్వహించిన ‘క్వశ్చన్ అవర్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తరచూ సీఎంలను మార్చుతుందన్న అపవాదుపై రేవంత్ స్పందిస్తూ.. హిమాచల్ ప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, అక్కడ సీఎంలు మారారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఉంటేనే ఉద్యమకారుడు.. లేదంటే తెలంగాణ ద్రోహి అనడం ఫ్యాషన్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉద్యమకారులకు సీట్లు ఇస్తే.. వేలకోట్లు ఉన్న వారికి బీఆర్ఎస్ రాజ్యసభ సీట్లు ఇచ్చిందని విమర్శించారు. ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తాము 60 శాతం సీట్లు ఇచ్చామన్నారు. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లికి ఓడిపోయే సీటు ఇచ్చారన్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరని ప్రచారం చేశారని, ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణిపై తొలి నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్న రేవంత్.. అంతర్జాతీయ నేరగాళ్లు ఉండే దేశాల నుంచి ధరణి పనిచేస్తోందని ఆరోపించారు. రెవెన్యూ రికార్డులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. వాటిని వారికి ఇచ్చే అధికారం కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని కొందరు ధరణి వచ్చాక వందల ఎకరాలకు ఆసాములయ్యారని తెలిపారు. ఊళ్లలోని భూములను ఎప్పుడో అమ్మేసుకున్న వారి పేర్లు ఇప్పుడు రికార్డుల్లోకి ఎలా వచ్చాయని రేవంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్ విజయభేరి యాత్ర – బీసీ డిక్లరేషన్ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ అందరికీ నా నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. రేవంత్ రెడ్డి రెండుచోట్ల ఘన విజయం సాధిస్తారన్నారు. కేసీఆర్ తన అవినీతి డబ్బుతో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని ఆ పార్టీ నాలుగైదు సీట్లు గెలిస్తే ఎక్కువ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, ఈ నెల 30వ తేదీన ఓటు వేసేందుకు ప్రజలు వేచి చూస్తున్నారన్నారు.
Read Also..
Read Also..
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. జనాభాలో అధిక శాతంగా ఉన్న వర్గాన్ని అణిచివేయాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో మీడియాతో సంజయ్ మాట్లాడారు. అణగారిన వర్గాల పట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఖరి మార్చుకోవాలని.. వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గమంతా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలు కూడా మా పార్టీకి మద్దతిస్తున్నారన్నారు. బీసీలకు బీఆర్ఎస్ కేవలం 23, కాంగ్రెస్ 19 సీట్లే ఇచ్చాయన్నారు. బీజేపీలో సీఎం అభ్యర్థిని ఎప్పుడూ ముందు ప్రకటించమన్నారు. ఎన్నికల తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు, అధిష్ఠానం కలిసి ఆ అభ్యర్థిని నిర్ణయిస్తారన్నారు. ఎవరు సీఎం అని ముందుగా ప్రకటించే సిస్టమ్ బీజేపీలో లేదన్నారు. ఒకరిద్దరు చెప్తే సీఎం అయ్యే వ్యక్తిని కాదన్నారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే చిత్తశుద్ధి గల కార్యకర్తను అని బండి సంజయ్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ బుధవారం ప్రకటించారు. తాను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. తన గద్వాల నియోజకవర్గంలో బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తామని చెప్పారు. తమ పార్టీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు సాగుతోందని, అందుకే తన స్థానంలో బీసీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. గద్వాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. తాను తమ పార్టీ అభ్యర్థుల తరఫున తెలంగాణవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తానన్నారు. కాగా, ఇప్పటికే కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ పోటీకి దూరంగా ఉన్నారు.




Total views : 78155