120
దేశానికి ఆదర్శంగా తెలంగాణ ముందుకెళ్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కొడంగల్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కేటీఆర్ మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది.. కరెంటు పోయిందన్నారు. కర్ణాటక రైతులు కొడంగల్ వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అక్కడి ప్రజలు చెంపలు వేసుకుంటున్నారన్నారు. తెలంగాణలో 24గంటల విద్యుత్ కాదని 5గంటలు ఇస్తామంటున్నారన్నారు. కొడంగల్ పేరును అంతర్జాతీయ స్థాయిలో చెడగొట్టిన వ్యక్తి రేవంత్‌రెడ్డిఅని విమర్శించారు. రూ.50 లక్షలతో అడ్డంగా దొరికారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని ప్రజలు గెలిపిస్తే.. కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా ప్రమోషన్ ఇప్పిస్తానన్నారు. కొడంగల్‌ను అద్భుత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం అని కేటీఆర్ అన్నారు.