కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు…

Advertisements

<p>అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి&period; ప్రధానంగా అమెరికా&comma; ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మదుపర్లలో ఆందోళన రేకెత్తించాయి&period; దీంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు కుప్పకూలాయి&period; మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1&comma;048 పాయింట్లు నష్టపోయి 80 వేల 239 వద్ద స్థిరపడింది&period; ఇది సెప్టెంబర్ 2025 తర్వాత సెన్సెక్స్ నమోదైన కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం&period; నిఫ్టీ కూడా313 పాయింట్లు కోల్పోయి 24 వేల 866 వద్ద ముగిసింది&period; మార్కెట్లో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతూ&period;&period; కొన్ని షేర్లు మాత్రమే లాభాల్లో ముగియగా&period;&period; మరికొన్ని షేర్లు నష్టంతో టాప్ లూజర్‌గా నిలిచాయి&period; ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలోనూ ఒత్తిడి కనిపించింది&period; అయితే&comma; నిఫ్టీ మెటల్ ఇండెక్స్ మాత్రం 0&period;24 శాతం లాభపడి సానుకూలంగా ముగిసింది&period; ప్రస్తుత మార్కెట్ సరళిపై నిపుణులు స్పందిస్తూ&period;&period; నిఫ్టీకి 24 వేల 600 పాయింట్ల వద్ద కీలక మద్దతు ఉందని తెలిపారు&period; ఈ స్థాయిని కోల్పోతే మార్కెట్లు మరింత పతనం అయ్యే అవకాశముందని హెచ్చరించారు&period; ఎగువన 25 వేల పాయింట్ల వద్ద నిరోధం ఉందని&comma; నిఫ్టీ ఆ స్థాయి పైన స్థిరపడే వరకు బేర్స్ ఆధిపత్యం కొనసాగవచ్చని విశ్లేషించారు&period; మిడ్ క్యాప్&comma; స్మాల్ క్యాప్ సూచీలు కూడా ప్రధాన సూచీల కంటే ఎక్కువగా నష్టపోయాయి&period; భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకునేందుకు వెనుకాడుతున్నారని&comma; లాభాల స్వీకరణ వైపు చూస్తున్నారని మార్కెట్ వర్గాలు తెలిపాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.