కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న

కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న

Advertisements

<p>కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు&period; ఇటీవల టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసిన రష్మిక&comma; సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు&period; అక్కడ సీఎం కుటుంబ సభ్యులతో ఆమె కాసేపు ఆప్యాయంగా గడిపారు&period; తమ వివాహ రిసెప్షన్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు&period; ఈ విషయాన్ని రష్మిక స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు&period; సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన అర్ధాంగి గీత&comma; ఆయన కుమార్తె నైమిషలను కలవడం చాలా సంతోషంగా ఉందని రష్మిక పేర్కొన్నారు&period; వారితో గడిపిన సమయం&comma; జరిపిన సంభాషణలు చాలా మధురంగా సాగాయని తెలిపారు&period; ఈ కలయికలో సీఎం అర్ధాంగి గీత&comma; రష్మికకు ఒక ప్రత్యేక బహుమతిని అందజేశారు&period; ఆ గిఫ్ట్ పట్ల మురిసిపోయిన రష్మిక&comma; ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు&period;&&num;8221&semi;గీత గారు ఇచ్చిన బహుమతి చాలా అందంగా ఉంది&period; దీన్ని నేను కచ్చితంగా ఏదైనా అత్యంత ప్రత్యేకమైన సందర్భంలో ధరిస్తాను&&num;8221&semi; అని రష్మిక పేర్కొన్నారు&period; రేవంత్ రెడ్డి కుటుంబంతో రష్మిక దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి&period; విజయ్ దేవరకొండను పెళ్లాడిన తర్వాత రష్మిక సీఎం కుటుంబాన్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్: నాచారంలో బాలామృతం ప్లాంట్ ప్రారంభం.

105 కేసుల నిందితుడిని అరెస్టు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసులు.