టీ20 ప్రపంచకప్ , సూపర్-8లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

Advertisements

<p>టీ20 ప్రపంచకప్ &comma; సూపర్-8లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది&period; కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది&period; మొత్తంగా ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా 19&period;2 ఓవర్లలో 199 పరుగులు చేసింది&period; ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ చివరి వరకు పోరాడి జట్టుకు విజయాన్ని అందించారు&period; ఈ విజయంతో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకోగా&period;&period; వెస్టిండీస్ సెమీస్ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది&period; ఈ గెలుపుతో భారత్‌ సెమీస్‌కు చేరింది&period; భారత జట్టు బ్యాటర్లలో సంజూ శాంసన్ &lpar;97&rpar;&comma; సూర్యకుమార్ యాదవ్ &lpar;18&rpar;&comma; తిలక్ వర్మ &lpar;27&rpar;&comma; హార్దిక్ పాండ్యా&lpar;17&rpar;&comma; శివమ్ దూబే&lpar;8&rpar;తో రాణించారు&period; విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్&comma; షమర్ జోసెఫ్ రెండు వికెట్లు&comma; అకేల్ హోసేన్ ఒక వికెట్ తీశారు&period; ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది&period; తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది&period; రోస్టన్ ఛేజ్ &lpar;40&rpar;&comma; జాసన్ హోల్డర్ &lpar;37&ast;&rpar;&comma; రోమన్ పావెల్ &lpar;34&ast;&rpar;&comma; షై హోప్ &lpar;32&rpar;&comma; షిమ్రాన్ హెట్మయెర్ &lpar;27&rpar;&comma; షెర్ఫానె రూథర్ఫోర్డ్ &lpar;14&rpar; రాణించారు&period; భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2&period;&period; హార్దిక్&comma; వరుణ్ తలో వికెట్ తీశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కోహ్లీ, శ్రేయస్ పోరాటం వృథా.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి.

గిల్ రిటైర్డ్ హర్ట్ అయినా.. అక్షర్-వాషింగ్టన్ అజేయ భాగస్వామ్యంతో భారత్ ఘన విజయం.

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.