గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

Advertisements

<p>గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు&period; లోక్‌సభలో ఆయన మాట్లాడారు&period; ఆర్థిక అంశాలపై అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నామన్నారు&period; మనకు ఎక్కువగా గల్ఫ్ నుంచి ముడిచమురు&comma; గ్యాస్ వస్తోందని తెలిపారు&period; యుద్ధం వల్ల ఇతర దేశాలతో జరిగే వాణిజ్యం దెబ్బతింటోందని వివరించారు&period; ముడిచమురును సముద్రమార్గం ద్వారానే మనం తెచ్చుకుంటున్నామని అన్నారు&period;పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు&period; గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చామని పేర్కొన్నారు&period; భారత్‌కు వచ్చే నౌకలన్నీ హర్మూజ్ జలసంధి నుంచే వస్తాయని తెలిపారు&period; ఈ సంక్షోభ సమయంలో దేశ ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు&period; ముడిచమురు&comma; ఎల్‌పీజీ గతంలో 27 దేశాల నుంచి దిగుమతి చేసుకునేవారమని&comma; ఇప్పుడు 41 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ప్రధాని మోడీ వివరించారు&period; దేశంలో ప్రస్తుతం 54 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు&period; ప్రస్తుతం మనకు సరిపడా నిల్వలు ఉన్నాయని&comma; ముడిచమురు&comma; గ్యాస్&comma; ఎరువుల రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు&period; మన నౌకలు సురక్షితంగా భారత్ చేరేలా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు&period; ప్రస్తుతం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలుపుతున్నామని అన్నారు&period; ఇక మరోవైపు రైల్వేలో విద్యుదీకరణ వల్ల డీజిల్ వినియోగం బాగా తగ్గిందన్నారు&period; దేశవ్యాప్తంగా ఈవీ బస్సులు&comma; ఇతర వాహనాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు&period; ఈవీ వాహనాలు భవిష్యత్తులో మరింత పెరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ అన్నారు&period; ప్రపంచంలో ఎక్కడ సమస్య వచ్చినా దాని ప్రభావం భారత్‌పై పడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు&period; ఆ ప్రభావం దేశంపై పడకుండా మనం స్వయం సమృద్ధి సాధించాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.