119
గుంటూరులో టీడీపీ నేతల ఓట్ల తొలగింపు ప్రక్రియ కలకలం రేపుతోంది. తమ ఓట్లను వైసీపీ నేతలు తొలగించారని టీడీపీ కార్పొరేటర్లు మునిసిపల్ అధికారులకు పిర్యాదు చేశామన్నారు. ఇరవై ఏళ్లగా తన ఓటు గుంటూరులో ఉందని.. దానిని వైసీపీ నేతలు తొలగించారని కార్పొరేటర్ కోటేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకుంటే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట కాబట్టి ఇక్కడ వెయ్యి ఓట్లు తొలగించటం.. ప్రజాస్వామ్యంలో నియంత పాలన అవుతుందని కార్పొరేటర్ బుజ్జి అవేదన వ్యక్తం చేశారు. పఫామ్ 7 తో టీడీపీ ఓట్లు తొలగించిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.