166
వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన అప్పటి నుండి పార్టీలో తనకు గుర్తింపు లేదంటూ దిగిన పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణనికి చెందిన వైసీపీ ఎస్సి నేత కోట.ఆంజనేయులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 2011 నుండి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనుక తిరిగి , పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన తనకి పార్టీలో సరైన గుర్తింపు లేదన్నారు. దాచేపల్లి పట్టణంలోని ఎస్సి కాలనిలో వైయస్సార్ విగ్రహం ఏర్పాటు చేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డితో ప్రారంభోత్సవం చేయించారు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదంటూ దీక్షలో కూర్చున్న ఆంజనేయులు మరియు అతని కుటుంబ సభ్యులు.