Saturday, May 9, 2026
News Navigation
Saturday, May 9, 2026
News Navigation

Breaking

Saturday, May 9, 2026
Home Telangana బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాం

బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాం

by Rama
బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసిందని ఆయన ఆరోపించారు. తాము అప్పులు చేసినట్లుగా ఆ పార్టీ ప్రచారం చేయడం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ తినడానికి అప్పులు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు అప్పులు చేసిందని క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 54 వేల కోట్లు అప్పులు చేసిందని తెలిపారు.
అసెంబ్లీలో ఎవరు ఎన్ని అప్పులు చేశారో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ నిధులను ఏడాదిలోపే వారి ఖాతాల్లో జమ చేశామని అన్నారు. సంక్రాంతి తరువాతే రైతు భరోసా వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అన్నదాతలను ప్రొత్సహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తాము బీఆర్ఎస్ నేతలు చెప్పినట్లుగా అబద్ధాలు చెప్పలేమని.. వారి ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?
    ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పారిశుధ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే తీవ్ర వైఫల్యాలకు నిలయంగా మారిందని…
  • హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..
    స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ…
  • ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..
    ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! సాధారణంగా పోలీసులు అంటే నేరస్తులకు భయం.. జైలర్ అంటే ఖైదీలకు వణుకు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు…
  • విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..
    పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్‌ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ…
  • యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..
    యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆలేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకే కాకుండా స్థానిక అధికార యంత్రాంగానికీ సవాలుగా మారాయి.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

010941
Total views : 70912

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.