ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో చంద్రుని ముక్క ఒకటి భూమికి దగ్గరగా వస్తూ.. భూమి తిరుగుతోందని శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో కనిపెట్టారు. అరిజోనా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. మనం గ్రహశకలంగా పరిగణించే కమోలెవా… చంద్రుడికి చెందినది కావచ్చు, ఎందుకంటే దానిపై సిలికేట్ కూడా ఉంది. పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తల ప్రకారం, ఇది మన గ్రహానికి చాలా దగ్గరగా ఉంది. భూమి చుట్టూ చందమామ మాత్రమే కాదు.. చంద్రుడి నుంచి విడిపోయిన ముక్క కమోలెవా కూడా తిరుగుతోందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. దీనిపై చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అక్టోబర్ 23న, కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ జర్నల్‌లో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రచురించారు. కమోలెవా భూమి యొక్క సహజ ఉపగ్రహంగా ప్రసిద్ధి చెందింది. లైవ్ సైన్స్‌లోని ఒక నివేదిక ప్రకారం, ఈ గ్రహశకలం పేరు కమోలెవా అనేది హవాయి పదం. దీనికి “డోలనం చేసే ముక్క” అని అర్థం. అరిజోనా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు కమోలెవా అనే గ్రహశకలం చంద్రుడికి చెందినది చెబుతున్నారు, ఎందుకంటే దానిపై సిలికేట్ కూడా ఉంది. పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తల ప్రకారం, ఇది మన గ్రహానికి చాలా దగ్గరగా ఉంది. కమోలెవాని 2016లో పాన్ స్టార్స్టె లిస్కోప్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కామోలేవా పెద్ద గ్రహశకలం కాదు. ఇది 130 నుండి 330 అడుగుల మధ్య ఉంటుంది. దాని సమీప కక్ష్యలో, ఇది మన భూ గ్రహం నుంచి సుమారు 9 మిలియన్ మైళ్ల (1.4 కోట్ల) దూరంలో ఉంది. ఇది చంద్రుడి నుంచి ఎందుకు విడిపోయిందో శాస్త్రవేత్తలకు ఇంకా అర్థం కాలేదు. Kamoolewa సుమారు 500 సంవత్సరాల కిందట భూ కక్ష్యలోకి ప్రవేశించినట్లు అంచనా వేశారు. రాబోయే 300 సంవత్సరాల పాటు ఇది భూ కక్ష్యలో ఉంటుంది.
గ్రహశకలం కాదు.. చంద్ర శిల.. భూమి చుట్టూ తిరుగుతోందన్న శాస్త్రవేత్తలు
128
previous post