116
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చగా పాలు తాగడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అనేక అనారోగ్యాలకు దూరంగా ఉండగలరు. ప్రతిరోజూ గ్లాసు పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. చలువ చేస్తుంది. ఒంట్లో వేడిమిని దూరం చేస్తుంది. వీటితో పాటు వేడి పాలను తాగితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. పురుషులు ప్రతిరోజూ రాత్రి ఒక గ్లాసు పాలు తాగితే హార్మోన్లు చురుకుగా పని చేస్తాయి. కనుక రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాసు వెచ్చని పాలు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
Read Also..
Read Also..