కామారెడ్డి నియోజకవర్గంపైనే రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బిక్కనూరు సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎందుకు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని చర్చ జరుగుతోందన్నిరు. కామారెడ్డి రైతుల కలలు నెరవేర్చడానికే కేసీఆర్ పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈనెల 9న ఆయన నామినేషన్ వేయబోతున్నారన్నారు. నామినేషన్ రోజు వచ్చే ప్రజలను చూసి ఇతర పార్టీల వాళ్లు పోటీ చేసేందుకే భయపడాలి. బీజేపీ ఇచ్చే చాక్లెట్లకు ఆశ పడొద్దు.. బీఆర్ఎస్ ఇచ్చే బిర్యానీ తినండి అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కొడంగల్ వచ్చి పోటీ చేయకుంటే తానే కామారెడ్డికి వస్తానని రేవంత్ సవాల్ చేశారన్నారు. ఆయన తీరు చూస్తుంటే తెగబలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడ కొట్టినట్లుగా ఉందన్నారు. పోచమ్మ గుడి ముందు పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్లే అన్నారు. ఉద్యమాల గడ్డ కామారెడ్డిలో ఉద్యమ నాయకుడు కేసీఆర్పై సవాల్ చేయడం అంటే అది మంచి పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ కు 55 ఏళ్లు అవకాశం ఇస్తే ఎందుకు కరెంటు, నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. సభలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
చాక్లెట్లకు ఆశ పడొద్దు.. బిర్యానీ తినండి..
126
previous post