కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నరేళ్లయిందని, ఈ సమయంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరీ యాత్రలో రేవంత్ పాల్గొన్నారు. తెలంగాణ వస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయనుకుంటే రైతుల ఆత్మహత్యలు కలిచివేశాయన్నారు. నిరుద్యోగంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. వచ్చే నెలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండ్రోజుల క్రితం గజ్వేల్, కామారెడ్డి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తన పాస్‌బుక్‌లు, 1బీ రికార్డులో గుంటభూమి అధికంగా చూపిస్తోందని అందులో కేసీఆర్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లిలో 36.1450 ఎకరాలు, అదే మండల శివారు వెంకటాపూర్‌లో 10 ఎకరాల భూమి ఉందని, తన భార్య శోభ పేరిట 7.1650 ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు. ఇద్దరి పేరిట మొత్తం 53.31 ఎకరాల భూమి ఉండగా పాస్‌బుక్, 1బీలో 53.31 ఎకరాలు అంటే గుంట భూమి ఎక్కువగా చూపిస్తోందని కేసీఆర్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. స్వయంగా సీఎం పేరుతో గుంటభూమి ఎక్కువగా నమోదైనా అధికారులు ఇప్పటి వరకు మౌనంగా ఎందుకున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అఫిడవిట్లో తప్ప ఇప్పటి వరకు ఆయన ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే, ఇలాంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. ధరణిలో భూమి ఎక్కువ తక్కువలు నమోదైన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో ఉన్నాయని విమర్శిస్తున్నాయి. సీఎం కేసీఆర్ స్వయంగా వెల్లడించిన దాని ప్రకారం ఇంకెవరిదో భూమిని ఆయన కలిపేసుకున్నట్టే కదా అని ప్రశ్నిస్తున్నాయి.
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గనికి భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నామినేషన్ వేయడానికి వచ్చారు మునుగోడు మండలం పులిపలుపుల గ్రామానికి చెందిన కంభంపాటి సత్యనారాయణ. తెలంగాణ వస్తే 92 వెయిల ఉద్యోగాలు ఇస్తానన్న చెప్పిన కేసీఆర్10 సంవత్సరాలు గడిసిన నోటిఫికేషన్ వెయ్యకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఇంటికో పింఛన్ ఇస్తున్నానని చెప్తున్న కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎందుకు చెప్పట్లేడని ప్రశ్నించారు. ఇంటికి క్వాటర్ బీర్లు పంపుతూ తాగుబోతుల తెలంగాణ చేసిండని,కేసీఆర్ కి ఓటు వేస్తే నిరుద్యోగులు బిక్షం ఎత్తుకుని పరిస్థితి వచ్చిందని, రైతులు కూడా బిక్షం ఎత్తుకొక తప్పదన్నారు.తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసినం కానీ కేసీఆర్ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకుండని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ని రాజకీయ నిరుద్యోగి చేయడమే తమ లక్ష్యం పంతమన్నారు. నేలపై పడుకుని సాష్టాంగ నమస్కారం చేస్తూ కేసీఆర్ కు ఓటు వేయొద్దని వేడుకున్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణం సిద్ధమయ్యింది. సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలోని.. అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. బీఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బీఆర్ఎస్ సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి అభ్యర్డులు సభలకు సర్వం సిద్ధం చేశారు. గత నాలుగు రోజుల నుంచి సభల ఏర్పాట్లు చేస్తుండగా.. సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. పోలీసు యంత్రాంగం భారీ భద్రతను ఏర్పాట్లు చేసింది.
తెలంగాణలో మోడీ ప్రభుత్వం నిరంతారయంగా విద్యుత్‌ను అందిస్తోందని కిషన్ రెడ్డి చేసిన ట్వీట్‌పై కవిత ఫైర్ అయ్యారు. ‘తెలంగాణలో 15,500 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. ఎన్టీపీసీ ప్లాంట్ కేవలం 680 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే తెలంగాణకు అందిస్తోంది. ఇది తెలంగాణ వినియోగిస్తున్న విద్యుత్‌లో కేవలం 4 శాతం మాత్రమే. కిషన్ రెడ్డి అన్న.. కేంద్ర ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్‌ను తెలంగాణకు అందిస్తోందని అబద్ధపు ప్రచారాలు మానుకోండి. కేసీఆర్ కృషి వల్లే పవర్ సర్ ప్లస్ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.’ అని కౌంటర్ ఇచ్చారు.
కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం అన్న కేసీఆర్.. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దన్నారు. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం..అన్నీ ఆలోచించి ఓటెయ్యాలన్నారు. ప్రతీ పార్టీ అభ్యర్థుల గురించి తెలసుకోవాలని.. అభ్యర్థి కంటే పార్టీ చరిత్ర చూసి ఓటెయ్యాలన్నారు. సింగరేణికి 134 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. సింగరేణి తెలంగాణ ఆస్తి అని చేత కాని దద్దమ్మల పార్టీ కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. అందుకే కేంద్రానికి 49 శాతం వాటా ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. తెలంగాణ వచ్చాక. బీఆర్ఎస్ పాలనలో సింగరేణి లాభాలను రూ.419 కోట్ల నుంచి…రూ.2,184 కోట్లకు తీసుకెళ్లామని కేసీఆర్ తెలిపారు.
Read Also..
Read Also..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు చోట్ల బరిలోకి దిగేందుకు సిద్దమయ్యారు. కొడంగల్‌లో తో పాటు కామారెడ్డి బరిలో కూడా నిలువాలని ఉందని , కేసీఆర్ ఫై పోటీ చేసే అవకాశం వస్తే బాగుంటుందని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ రావడం తో..రేవంత్ కామారెడ్డి లో కేసీఆర్ ఫై పోటీ కి సిద్ధం అవుతున్నారు. ఈ నెల 6 న ముందుగా కొడంగల్‌లో రేవంత్ నామినేషన్ వేసి , తర్వాత ఈ నెల 8వ తేదీన కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. ఇక రేవంత్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతుండడంతో షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయబోతున్నాడు. అలాగే షబ్బీర్ అలీ నామినేషన్‌కి రేవంత్‌రెడ్డి వెళ్లనున్నట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. లక్ష్మణ్, ఈటల, రఘునందనరావు తదితర బీజేపీ నేతలతో కలిసి కిషన్ రెడ్డి ప్రాజెక్టును పరిశీలించారు. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ కుంగుబాటు గురించి మాట్లాడకూడదనే ఉద్దేశంతో తాము ఇప్పుడు ప్రాజెక్టును సందర్శించామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, విధానాలపై తెలంగాణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. మేడిగడ్డ వద్ద కుంగిన ప్రాంతాన్ని పూర్తిగా తొలగించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిందన్నారు. గ్రౌండ్ రిపోర్ట్ చూశాక మాట్లాడాలనే ఉద్దేశ్యంతో తాము ఈ ప్రాజెక్టును సందర్శిస్తున్నామన్నారు. కాగా, బీజేపీ నేతలు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగడ్డ వద్దకు చేరుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో పోటీ చేయటం లేదని ప్రకటించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వ్యతిరేక ఓటు చీల్చటం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారామె. నవంబర్ 3వ తేదీ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె.. ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసి.. వ్యతిరేక ఓటును చీల్చటం ద్వారా.. కేసీఆర్ గెలుపునకు సాయం చేయాలనే ఉద్దేశం లేదని వివరించారామె. దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని.. సోనియా, రాహుల్ గాంధీతో సమావేశం అయినప్పుడు.. వ్యతిరేక ఓట్లు చీల్చటం వల్ల ఉపయోగం లేదని సలహా, సూచన చేశారాన్నారు వైఎస్ షర్మిల. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చి.. కేసీఆర్ సీఎం అయితే.. చరిత్ర క్షమించదనే భయం కూడా ఉందన్నారు షర్మిల. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని.. కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేసే అవకాశం ఉన్నందున.. కాంగ్రెస్ పార్టీకి.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారామె.
కామారెడ్డి నియోజకవర్గంపైనే రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బిక్కనూరు సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎందుకు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని చర్చ జరుగుతోందన్నిరు. కామారెడ్డి రైతుల కలలు నెరవేర్చడానికే కేసీఆర్ పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈనెల 9న ఆయన నామినేషన్ వేయబోతున్నారన్నారు. నామినేషన్ రోజు వచ్చే ప్రజలను చూసి ఇతర పార్టీల వాళ్లు పోటీ చేసేందుకే భయపడాలి. బీజేపీ ఇచ్చే చాక్లెట్లకు ఆశ పడొద్దు.. బీఆర్ఎస్ ఇచ్చే బిర్యానీ తినండి అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కొడంగల్ వచ్చి పోటీ చేయకుంటే తానే కామారెడ్డికి వస్తానని రేవంత్ సవాల్ చేశారన్నారు. ఆయన తీరు చూస్తుంటే తెగబలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడ కొట్టినట్లుగా ఉందన్నారు. పోచమ్మ గుడి ముందు పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్లే అన్నారు. ఉద్యమాల గడ్డ కామారెడ్డిలో ఉద్యమ నాయకుడు కేసీఆర్‌పై సవాల్ చేయడం అంటే అది మంచి పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ కు 55 ఏళ్లు అవకాశం ఇస్తే ఎందుకు కరెంటు, నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. సభలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.





Total views : 147302