చిట్టి రాగులు.. గట్టి లాభాలు

Chitti Ragu

Advertisements

&NewLine;<p>చూడటానికి సన్నగా కనిపిస్తాయి గానీ రాగుల్లో క్యాల్షియం&comma; ఐరన్‌ వంటి పోషకాలు దండిగా ఉంటాయి&period; ఈ చిరుధాన్యాల్లో ప్రోటీన్‌&comma; పీచుతో పాటు ఖనిజాలు కూడా ఎక్కువే&period; పైగా కొవ్వు శాతం తక్కువ&period; మధుమేహులకు&comma; వూబకాయులకైతే రాగులు వరదాయిని అనుకోవచ్చు&period; ఎందుకంటే ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి&period; వీటిల్లో మన శరీరానికి అవసరమైన ట్రిప్టోథాన్‌&comma; వాలైన్‌&comma; మెథియోనైన్‌&comma; ఐసోల్యూసిన్‌&comma; థ్రియోనైన్‌ వంటి అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి&period; వంద గ్రాముల రాగిపిండిని తింటే ఆ రోజుకి మనకు అవసరమైన 350 మి&period;గ్రా&period; క్యాల్షియం లభించినట్టే&period; అలాగే ఐరన్‌ 3&period;9 మి&period;గ్రా&period;&period; నియాసిన్‌ 1&period;1 మి&period;గ్రా&period; థయమిన్‌ 0&period;42 మి&period;గ్రా&period;&period; రైబోఫ్లావిన్‌ 0&period;19 మి&period;గ్రా&period;&period; కూడా అందుతాయి&period; ఇలాంటి పోషకాలతో కూడిన రాగులు మనకు ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తాయో చూద్దాం&period; అధిక బరువు తగ్గటానికి రాగుల్లోని ట్రిప్టోథాన్‌ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది&period; ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి అదనంగా శరరంలో కేలరీలు పోగుపడకుండా చూస్తాయి&period; ఇక వీటిల్లోని పీచు కడుపు నిండిన భావన కలిగించి&comma; ఎక్కువగా తినకుండా చేస్తాయి&period; ఇవన్నీ బరువు తగ్గేందుకు తోడ్పడేవే&period; ఎముక పుష్టికి వీటిల్లో క్యాల్షియం దండిగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి&period; ముఖ్యంగా ఎదిగే పిల్లలకు&comma; వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి&period; పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు&comma; వృద్ధుల్లో ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి&period; ఎముక క్షీణతను నివారించి విరిగే ముప్పును తగ్గిస్తాయి&period; మధుమేహం నియంత్రణకు రాగుల్లోని ఫైటోకెమికల్స్‌ జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి&period; దీంతో రక్తంలోకి గ్లూకోజు త్వరగా విడుదల కాదు&period; ఇలా రక్తంలో గ్లూకోజు స్థాయులు నియంత్రణలో ఉండేందుకు తోడ్పడతాయి&period; కొలెస్ట్రాల్‌ తగ్గేందుకు లెసిథిన్‌&comma; మెథియోనైన్‌ అనే అమైనో ఆమ్లాలు కాలేయంలో పోగుపడిన కొవ్వును నిర్మూలిస్తుంది&period; ఇక థ్రియోనైన్‌ అమైనో ఆమ్లమైతే కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా చూస్తుంది&period; రక్తహీనత&colon; రాగుల్లోని ఐరన్‌ రక్తహీనత తగ్గటానికి దోహదం చేస్తుంది&period; ఆందోళన వీటిల్లోని ట్రిప్టోథాన్‌ అమైనో ఆమ్లం శారీరక&comma; మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది&period; అందువల్ల ఆందోళన&comma; కుంగుబాటు&comma; నిద్రలేమి వంటి సమస్యల నివారణకు తోడ్పడతాయి&period; కొన్నిరకాల పార్శ్వనొప్పులు తగ్గటానికీ ఉపయోగపడుతుంది&period; కండరాల మరమ్మతుకు ఐసోల్యూసిన్‌ అమైనో ఆమ్లం కండరాల మరమ్మతుకు&comma; రక్తం ఉత్పత్తికి&comma; ఎముక ఏర్పడటానికి&comma; చర్మం ఆరోగ్యం మెరుగుపడటానికి దోహదం చేస్తుంది&period; వాలైన్‌ అమైనో ఆమ్లం జీవక్రియ సరిగా జరగటంలో పాలుపంచుకుంటుంది&period; కండరాలు సమన్వయంతో పనిచేయటానికి&comma; శరీరంలో నైట్రోజన్‌ సమతుల్యతకు తోడ్పడుతుంది&period; వృద్ధాప్యం దూరంగా రాగులను క్రమం తప్పకుండా తింటే పోషణలోపాన్ని దూరంగా ఉంచొచ్చు&period; వయసుతో పాటు వచ్చే సమస్యలతో పాటు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండానూ చూసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం