ఛత్తీస్ గఢ్: కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్…

Advertisements

<p>ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ -2 కొనసాగుతోంది&period; భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది&period; భారీగా ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు&period;<br &sol;>&NewLine;బీజాపూర్&comma; ములుగు జిల్లాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్విరామంగా కొనసాగుతోంది&period; దాదాపు 2 వేల మంది కోబ్రా బలగాలు మావోయిస్టుల ఏరివేత కోసం తడపాల&comma; డోలి పరిసర అటవీ ప్రాంతాలతో పాటు కర్రె గుట్టలపై కూంబింగ్ నిర్వహిస్తున్నారు&period; బుధవారం సాయంత్రం&comma; గురువారం తెల్లవారు జామున రెండు సార్లు మావోయిస్టులకు&comma; పోలీస్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది&period; కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా లేకపోవడంతో అక్కడి అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావడం లేదు&period; ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు&period; మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు కానీ ముఖ్య నాయకుడు కానీ ఉన్నట్టుగా తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జీ&comma; జూనియర్‌ క్యాడర్‌కు చెందిన బెటాలియన్‌ ఇన్‌ఛార్జి కేసా సోధి కోసం 2 వేల మందితో కూడిన బలగాలు వేటను ప్రారంభించాయి&period; 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం 2024లో మావోయిస్టుల కోసం భారీ ఆపరేషన్‌లను చేపట్టింది&period; సీఆర్పీఎఫ్&comma; కోబ్రా&comma; డీఆర్జీ&comma; సీఏఎఫ్‌ సంయుక్త బలగాలు గత ఏడాది ఏప్రిల్‌ నెలలో 21 రోజుల పాటు కర్రెగుట్టల్లో నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు&period; ఇక్కడినుంచి మావోయిస్టు పార్టీ సీనియర్‌ క్యాడర్‌ తప్పించుకుంది&period; ప్రస్తుతం కర్రెగుట్టల్లోని తడపల&comma; పామునూరు&comma; మురుమూరు&comma; డోలీ వంటి ప్రాంతాల్లో ఫార్వర్డ్‌ ఆపరేటింగ్‌ బేస్‌&rpar;లను ఏర్పాటు చేసి సీఆర్పీఎఫ్‌ బలగాలు నిత్యం ఆపరేషన్‌ చేపడుతున్నాయి&period; తాజాగా చేపట్టిన &OpenCurlyQuote;కేజీహెచ్‌-2’ సైతం అత్యంత వ్యూహాత్మక ఆపరేషన్‌గా భావిస్తున్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.