123
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓటర్లు పరిణతితో ఆలోచించి ఓటేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని BRS అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్రలో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఓటును సరిగ్గా వాడితే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీల గురించి కూడా ఆలోచన చేసి ఓట్లేయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. గత పాలకులు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదు. వలసలు వెళ్లి చాలా బాధలు అనుభవించిన జిల్లా పాలమూరు. గతంలో పాలమూరు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులకు కాంగ్రెస్ కారణం కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. దేవరకద్ర నియోజకవర్గ BRS అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.