136
వన్డే ప్రపంచకప్ లో సెమీ ఫైనల్స్ కు అర్హత సాధించిన టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ స్పష్టం చేసింది. మొదట అతడు సెమీఫైనల్స్ నాటికి కోలుకుంటాడని అంతా భావించారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు కోలుకోవడం కష్టంగా మారింది. దాంతో మిగిలిన టోర్నీకి హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండబోవడం లేదని ఐసీసీకి బీసీసీఐ తెలియజేసింది. హార్దిక్ పాండ్యా స్థానంలో ప్రసిధ్ కృష్ణ భారత జట్టుతో కలవనున్నాడు. ఈ విషయాన్ని కూడా ఐసీసీ స్పష్టం చేసింది.