80
దసరా శరన్నవరాత్రులు ముగిసిన సందర్భంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘనంగా దుర్గాపూజ కార్నివాల్ నిర్వహించారు. ఈ కార్నివాల్‌కు బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ హాజరయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ దుర్గా పూజ కార్నివాల్‌ను వేల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. కార్యక్రమంలో భాగంగా కళాకారులు ప్రదర్శించిన నృత్య కళలు చూపరులను అలరించాయి. దుర్గాదేవికి సంబంధించిన ఓ భక్తి పాటకు పురుష, మహిళా కళాకారులు కర్రలపై నిలబడి చేసిన నృత్యం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్నివాల్‌లో ప్రదర్శించిన వివిధ కళలను మమతాబెనర్జీ ఆసక్తిగా తిలకించారు. పాటకు అనుగుణంగా తన ముందున్న టేబుల్‌పై రెండు చేతులతో లయబద్ధంగా కొడుతూ ఆమె ఎంజాయ్ చేశారు.