Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home National రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు…

రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు…

by Rama
రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు...

వీడీ సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల లక్నో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. గత ఏడాది మహారాష్ట్రలో జరిగిన భారత్ జోడో యాత్రలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంథీ వీడీ సావర్కర్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తరప్రదేశ్ కు చెందిన న్యాయవాది నృపేంద్ర పాండే పిటిషన్ దాఖలు చేశారు. సావర్కర్‌ను బ్రిటీష్ వారికి సహకరించిన వ్యక్తిగా రాహుల్ గాంధీ పేర్కొన్నారని, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని పాండే స్పష్టం చేశారు.
అంతేగాక మహాత్మా గాంధీ గతంలో సావర్కర్‌ను దేశభక్తుడిగా గుర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ముందుగా రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ను ఆశ్రయించగా.. ఈ పిటిషన్ ను ఏసీజేఎం అంబరీష్ కుమార్ శ్రీ వాస్తవ తోసిపుచ్చారు. దీంతో పాండే సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. ఈ ఫిర్యాదును విచారించిన లక్నో కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు ​​జారీ చేస్తున్నట్లు తెలిపింది. భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ.. సావర్కర్ ఒక బ్రిటిష్ సేవకుడని, అతను పెన్షన్ పొందాడని, సమాజంలో ద్వేషాన్ని, దుష్ప్రవర్తనను వ్యాపింపజేశాడని ఆరోపించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
    వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
    రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
  • యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
    హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
  • ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.
    ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

039479
Total views : 197058

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: