వీడీ సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల లక్నో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. గత ఏడాది మహారాష్ట్రలో జరిగిన భారత్ జోడో యాత్రలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంథీ వీడీ సావర్కర్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తరప్రదేశ్ కు చెందిన న్యాయవాది నృపేంద్ర పాండే పిటిషన్ దాఖలు చేశారు. సావర్కర్‌ను బ్రిటీష్ వారికి సహకరించిన వ్యక్తిగా రాహుల్ గాంధీ పేర్కొన్నారని, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని పాండే స్పష్టం చేశారు.
అంతేగాక మహాత్మా గాంధీ గతంలో సావర్కర్‌ను దేశభక్తుడిగా గుర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ముందుగా రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ను ఆశ్రయించగా.. ఈ పిటిషన్ ను ఏసీజేఎం అంబరీష్ కుమార్ శ్రీ వాస్తవ తోసిపుచ్చారు. దీంతో పాండే సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. ఈ ఫిర్యాదును విచారించిన లక్నో కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేస్తున్నట్లు తెలిపింది. భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ.. సావర్కర్ ఒక బ్రిటిష్ సేవకుడని, అతను పెన్షన్ పొందాడని, సమాజంలో ద్వేషాన్ని, దుష్ప్రవర్తనను వ్యాపింపజేశాడని ఆరోపించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమొబైల్ విడిభాగాలు, స్టీల్‌పై 50 శాతం భారీ దిగుమతి సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్‌లు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.…
- అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. H-1B వీసాపై లక్షా 3 వేల డాలర్ల వరకు ఫీజు విధించే ప్రతిపాదనలను తీసుకొచ్చింది. కోర్టులు గతంలో కొన్ని చర్యలను అడ్డుకున్నప్పటికీ, వీసా విధానాల్లో కఠిన మార్పుల…
- శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.శ్రీరంగపట్నంలోని ఆరతి ఉక్కడ ఆలయంలో ఎమ్మెల్యే కుమార్తె, పోలీసు సబ్ఇన్స్పెక్టర్ మధ్య ఘర్షణ సంచలనంగా మారింది. మహిళా పీఎస్ఐ, ఎమ్మెల్యే కుమార్తె ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. భీమ అమావాస్య వేడుకల సందర్భంగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించే విషయంలో…
- ‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి.‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ: ఇరుముడి బ్లాక్‌బస్టర్ ప్రెస్మీట్లో మాస్ మహారాజా రవితేజ మాస్ మహారాజా రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ…
- AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి