దేవతల వివిధ స్వరూపములు..

Different forms of deities

Advertisements

&NewLine;<p>ప్రకృతి విష్ణుస్వరూపమగుటచే అయిదు దశాంశలు విష్ణువునకు ప్రతీక&period; పార్వతీ పరమేశ్వరుల యోగమందు వారిరువురకు కుమారుడగుటచే బ్రహ్మ శివునిలో దశాంశరూపుడాయెను&period; కారణము సుస్పష్టమే&excl; చేతనస్వరూపుడయిన శివుడు ప్రధానుడు&period; మిధ్యారూప జగత్తునకు ప్రతీక విష్ణు స్వరూపము అగుటచే అప్రధానుడు&period; అందువలన శివునిలో బ్రహ్మ దశాంశరూపుడు&period; ఇట్టి దశాంశరూపబ్రహ్మకు ఏకాంకము ప్రతీకము&period; ఇటువంటి ఏకాంకము రెండు మొదలుకొని తొమ్మిది వరకు గల అష్టమూర్తులలోనూ వ్యాపించియున్నది&period; అందుచేత బ్రహ్మకు నవప్రజాపతి స్వరూపము సిద్ధించెను&period; పదహారు&comma; నూరు&comma; వెయ్యి అనెడి మూడు పదములలో చివర రెండు పదములు ముక్తానుబంధరీతిగా గణింపబడి 116&comma; 1116 అనెడి రూపము నందినవి&period; వీటిని పదిచే భాగించిన యెడల సృష్టి యందలి వివిధ వస్తుసముదాయములు ప్రతీకలగును&period; రుద్రునకు 1 అను పూర్ణాంకము&comma; విష్ణువునకు 11 అను రెండు పూర్ణాంకములు&comma; బ్రహ్మకు 111 అను మూడు పూర్ణాంకములు వచ్చును&period; 16&comma; 116&comma; 1116 అను వాటిని షోడశాది త్రిదక్షిణ అని అందురు&period; త్రిదక్షిణము దానము చేయువారికి బ్రహ్మజ్ఞానము కలుగునని చెప్పబడినది&period; త్రిదక్షిణము దానము చేయుట వలన శరీరము&comma; ధనము&comma; మనస్సు అను మూడింటిని దానము చేసినవాడగును&period; పైన చెప్పిన సంఖ్యలలో తుల్యమగు ద్రవ్యమును దానము చేయుట గత జగత్తును దానము చేసిన ఫలము లభించుచున్నది&period; పిండాండదానము జగత్తునకు ప్రతీకము&period; మన శరీరము సవనత్రయమే రూపముగా గలది&period; ప్రాతస్సవనము&comma; మాధ్యందిన సవనము&comma; తృతీయ సవనము అనునది గాయత్రీ &&num;8211&semi; త్రిష్టుప్ &&num;8211&semi; జగతీ ఛందస్సంబంధమైన వర్ణములు అనగా గాయత్రికి 24&comma; త్రిష్టుప్ నకు 44&comma; జగతికి 48 కలిపి మొత్తం 116 వర్ణములు ఉండుట వలన యీ పిండాండదానము &lpar;శరీర దానము&rpar; వలన కూడా పైన చెప్పబడిన ద్రవ్య దానఫలము లభించును&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..