111
మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. నామినేషన్‌కు ముందు కర్మన్‌ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేను ఆంజనేయస్వామి భక్తుండనని అందుకే ఇక్కడ పూజలు నిర్వహించనని తెలిపారు. రాబోయేది బిజెపి ప్రభుత్వం అని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వసతులు కల్పిస్తామని సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అందెల తెలియజేశారు. బిజెపి గుర్తుకు ఓటు వేసి మహేశ్వరం నియోజకవర్గం నుండి తనను గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న క్రమంలో పెద్ద ఎత్తున బిజెపి శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. పార్టీకి చెందిన నేతలు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Also..