నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని నిరుద్యోగుల తరఫున స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నానట్లు సోషల్ మీడియా పాపులర్ బర్రెలక్క అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటున్నట్లు నామినేషన్ అనంతరం తెలిపారు గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు డిగ్రీలు పీజీలు చేసిన ఉద్యోగాలు రాకపోవడంతో బర్రెలు గొర్రెలు కాస్తూ కాలం వెలదీస్తున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారింది. పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష గత ఏడాది తాను డిగ్రీ పీజీలు చేసిన ఉద్యోగాలు రాక బర్రెలు కాస్తున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ పోస్ట్ వైరల్ గా మారడంతో అధికారులు ఆమెపై కేసు పెట్టారు దీంతో ఏడాదిగా తాను కోర్టు చుట్టూ తిరుగుతూ మానసిక వేదనకు గురయ్యానని నిరుద్యోగుల తరఫున తాను నామినేషన్ వేస్తున్నానని తనను గెలిపించాలని కోరారు.
99
previous post