నేపాల్ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రభంజనం సృష్టించింది.

Advertisements

<p>నేపాల్ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రభంజనం సృష్టించింది&period; నేపాల్ ఎన్నికలు ఆ దేశ రాజకీయాలను సమూలంగా మార్చేశాయి&period; కేవలం మూడున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ పార్లమెంట్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది&period; దశాబ్దాలుగా తమను శాసిస్తున్న హేమాహేమీలను కాదని&period;&period; నవతరం వైపు మొగ్గు చూపారు నేపాలీలు&period; పాత పార్టీలను తుడిచిపెట్టిన బాలెన్ à°·à°¾ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది&period; ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ విధానంలో 165 స్థానాలకు గాను 163 స్థానాల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా&comma; ఆర్ఎస్పీ ఏకంగా 125 సీట్లలో విజయభేరి మోగించింది&period; మొత్తం 275 స్థానాలు కలిగిన నేపాల్ ప్రతినిధుల సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో బాలెన్ నేతృత్వంలోని ఆర్ఎస్పీ అధికారం చేపట్టనుంది&period;<&sol;p>&NewLine;<p>ఈ ఎన్నికల సునామీలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా ఎందరో రాజకీయ హేమాహేమీలు ఓటమి పాలయ్యారు&period; ఆర్ఎస్పీ ప్రధాని అభ్యర్థి&comma; ఖాట్మండు మాజీ మేయర్ బాలెన్ à°·à°¾&period;&period; ఓలీకి కంచుకోటగా భావించే ఝాపా-5 నియోజకవర్గంలో ఆయనపై ఘనవిజయం సాధించారు&period; నేపాల్ పార్లమెంటరీ చరిత్రలోనే ఏ అభ్యర్థికి రానన్ని అత్యధికంగా 68&comma;348 ఓట్లను బాలెన్ à°·à°¾ దక్కించుకున్నది&period; మరోవైపు&comma; నేపాలీ కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా భావించిన గగన్ థాపా కూడా ఆర్ఎస్పీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు&period;ఎఫ్‌పీటీపీ విధానంలోనే కాకుండా&comma; దామాషా ప్రాతినిధ్య పద్ధతిలోనూ ఆర్ఎస్పీ 48 శాతానికి పైగా ఓట్లతో ఆధిక్యంలో ఉంది&period; ఈ ట్రెండ్ కొనసాగితే&comma; 275 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో ఆర్ఎస్పీ దాదాపు మూడింట రెండొంతుల మెజారిటీతో దాదాపు 184 సీట్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది&period; 1991 తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా ఇంతటి భారీ మెజారిటీని సాధించలేదు&period;ఈ చారిత్రక తీర్పుతో నేపాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.