ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్

KCR

Advertisements

&NewLine;<p>భైంసాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు&period; ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆగమాగం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని&comma; కానీ ఆలోచించి ఓటేయాలన్నారు&period; ప్రతిపక్షాలు అబద్దాలు&comma; గాలిమాటలు చెబుతున్నాయన్నారు&period; ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉన్న ఒకే ఒక వజ్రాయుధం ఓటు అన్నారు&period; ఈ ఓటును మంచిగా వినియోగించుకోవాలన్నారు&period; ప్రతిపక్షాల మాయలో ఎవరూ పడవద్దన్నారు&period; ఏ పార్టీ వైఖరి ఎలా ఉందో ప్రజలంతా పరిగణలోకి తీసుకోవాలన్నారు&period; బీఆర్ఎస్ పాలనలో భైంసాలో రోడ్లు ఎలా వెడల్పు అయ్యారో అందరూ చూస్తున్నారన్నారు&period; కులం&comma; మతం లేకుండా మనం అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు&period; కాంగ్రెస్ నేతలు ఇన్నాళ్లు దళితులను ఓటుబ్యాంకుగా మార్చుకున్నారు తప్ప వారికి చేసిందేమీ లేదన్నారు&period; కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధును తీసుకువచ్చింది అని కేసీఆర్ అన్నారు&period; బీఆర్ఎస్ వచ్చాక ఎరువుల కొరత లేదన్నారు&period; భైంసాలో&comma; ముధోల్‌లో ఇలా అన్నిచోట్ల హిందువులు&comma; ముస్లింలు ఉన్నారని&comma; కానీ భైంసాలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కేసీఆర్ విమర్శలు గుప్పించారు&period; బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో కర్ఫ్యూలు&comma; ధర్నాలు లేవన్నారు&period; విద్వేషాలు రెచ్చగొట్టే వారిని దూరం పెట్టాలన్నారు&period; అన్ని మతాలు&comma; కులాల వాళ్లం కలిసి ముందుకు సాగుదామన్నారు&period; బీఆర్ఎస్ మరోసారి గెలిస్తేనే తెలంగాణ మరింత ముందుకు సాగుతుందన్నారు&period; స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కుప్పం ఎయిర్‌పోర్టు భూసేకరణకు మార్గం సుగమం..

15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..