105
ఎప్పట్లాగే ఈసారీ బాలాపూర్ లడ్డూ వేలం అత్యంత ఆకర్షణగా నిలిచింది. అత్యధిక ధర కూడా పలికింది. ఈసారి లడ్డూను తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి 27 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులతోపాటు మొత్తం 36 మంది పాల్గొన్నా. బాలాపూర్ ఉత్సవ సమితి 1,116 రూపాయలతో వేలం పాట మొదలుపెట్టింది. వేలంపాటలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిసహా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వేలం పూర్తి కాగానే బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభించారు. ప్రత్యేక వాహనంలో విఘ్నేశ్వరుడిని హుస్సేన్ సాగర్‌కు తరలించారు. బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర చాంద్రాయణగుట్ట, షాలిబండ, ఫలక్‌నుమా, చార్మినార్ మీదుగా హుస్సేన్‌సాగర్ వైపు సాగింది.