ఫ్రాన్స్‌ను వణికిస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్

Eyes infection

Advertisements

&NewLine;<p>కళ్లలో రక్తస్రావం కలిగిస్తోన్న ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఫ్రాన్స్‌ను వణికిస్తోంది&period; ఈ వ్యాధి పేరు &OpenCurlyQuote;క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్’ అని వైద్యనిపుణులు తెలిపారు&period; ఇది ఒక రకం పురుగుల ద్వారా వ్యాపిస్తోందని గుర్తించారు&period; బాధితుల్లో కండరాల నొప్పి&comma; గొంతులో మంట&comma; వాంతులు&comma; కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి&period; ముక్కు&comma; కళ్లు&comma; చర్మంలోని రక్తనాళాలు పగిలి&comma; వాటి నుంచి రక్తస్రావం జరుగుతుండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు&period; జ్వరం&comma; కళ్లు తిరగడం&comma; మెడ&comma; వెన్ను&comma;తలనొప్పి&comma; కళ్లు ఎర్రబారడం&comma; వెలుగును చూడలేకపోవడం వంటిని కనిపిస్తున్నాయి&period; వ్యాధి ముదిరేకొద్ది ఈ లక్షణాలు మరింత తీవ్రమవుతున్నాయని వైద్యులు అప్రమత్తం చేశారు&period; కాగా ఫ్రాన్స్-స్పెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి&period; కాబట్టి ఈ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తగా ఉండాలని పౌరులను ఫ్రాన్స్ హెచ్చరించింది&period; కాగా క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ వ్యాధి ఎబోలా వైరస్‌కు సంబంధించినదని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; ఆఫ్రికా&comma; పశ్చిమాసియా ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తుందని తెలిపారు&period; వాతావరణంలో మార్పుల కారణంగా ఈ వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు&period; మరోవైపు ఈ వ్యాధి తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది తొలి ప్రాధాన్య వ్యాధుల్లో దీనిని కూడా చేర్చుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..